కొవ్వూరు: బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

10చూసినవారు
కొవ్వూరు: బాధిత కుటుంబానికి పరిహారం అందజేత
ధర్మవరం గ్రామంలో విద్యుత్ తీగల కారణంగా దురదృష్టవశాత్తు మృతి చెందిన సౌమ్య కుటుంబాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి, విద్యుత్ శాఖ అందించే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా నిధులు త్వరితంగా అందేలా చూస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్