యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందవచ్చని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం కొవ్వూరులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి యోగాసనాలు వేసారు. యోగా ద్వారా కలుగు ప్రయోజనాలను ఆవశ్యకతను వివరించారు.