రాజమండ్రి కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం పూడిక తీత పనులు చేపట్టారు. నిత్యం ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది వాహనాలు ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తారు. డివైడర్ కి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తచెదారం ఇసుకను పోగుచేసి వాహనాల ద్వారా తరలిస్తున్నారు. దీంతో బ్రిడ్జిపై ప్రయాణించేటప్పుడు ఇసుక కళ్లలో పడిపోయేది లేదని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.