దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఒక గొప్ప యోధుడు, సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు అని డా. బాబు జగ్జీవన్ రామ్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కొవ్వూరులోని 3వ వార్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆదర్శాలే మనకు మార్గదర్శకాలు అన్నారు.