వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ డా. గూడూరు శ్రీనివాసుని మంగళవారం కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కాపు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు రాజకీయంగా అందుబాటులో ఉండడమే కాకుండా, వైద్య సేవల ద్వారా కూడా విశేష సేవలందిస్తున్న శ్రీనివాసును కాపు నాయకులు ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కోసం భారీ ప్రణాళిక రూపొందిస్తున్నామని తోట రామకృష్ణ తెలిపారు.