కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని, లేకుంటే సంబంధిత అధికారులను ప్రశ్నిస్తామని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మంగళవారం అన్నారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజారోగ్యమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు.