కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో జరిగిన "సుపరిపాలనలో తొలి అడుగు" డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతంగా కొనసాగిoచి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు.