కొవ్వూరు: కొవ్వాడ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

13చూసినవారు
కొవ్వూరు: కొవ్వాడ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
చాగల్లు మండలం మార్కొండపాడు–దారవరం గ్రామాల మధ్య ఉన్న కొవ్వాడ కాలువ ప్రాంతాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఇటీవలే కురిసిన వర్షాలతో నీరు పెరిగి, పంట పొలాలకు ముంపు ప్రమాదం ఏర్పడిన ప్రాంతాలను సందర్శించారు. వర్షాకాలంలో రైతులు ఆందోళన చెందకుండా పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని తక్షణమే అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్