ఆంధ్రుల కలల రాజధాని "అమరావతిని "వేశ్యల రాజధాని" అని సాక్షి డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని వారు మాట్లాడి ఆడబిడ్డలను అవమానించినందుకు సాక్షి ఛానల్ ప్రసారాల అనుమతులు రద్దు చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం అన్నారు. కొవ్వూరు పార్టీ కార్యాలయం నుండి విజయ విహార సెంటర్ వరకు నియోజకవర్గ మహిళలు ధర్నా నిర్వహించి, విజయ విహార్ సెంటర్ వెళ్లి సాక్షి దినపత్రికను దహనం చేశారు.