కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తైన సందర్భoగా "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని ప్రారంభించామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడే వెంకటేశ్వరరావు శనివారo అన్నారు. ఈ సందర్బంగా కొవ్వూరు నియోజకవర్గం మార్కొండపాడు గ్రామంలో ఇంటింటికి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. ప్రజలతో మమేకమై ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే రోజులలో చేపట్టబోయే ప్రజాపయనాన్ని ప్రజలకు వివరించారు.