కొవ్వూరు పశువుల ఆసుపత్రి వద్ద ప్రపంచ జూనోసిస్ దినోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని శునకాలకు వ్యాక్సినేషన్ వేశారు. జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పశువైద్యశాలలో ఉచితంగా అంటి-రేబిస్ టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని తమ పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించాలన్నారు.