కొవ్వూరు నియోజకవర్గంలో పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆశాజ్యోతి అవుతోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మద్దూరు గ్రామానికి చెందిన బండి వేణుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరై, ఆయనే స్వయంగా ఆదివారం పత్రాన్ని అందజేశారు. మానవతా విలువలతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పాలన కొనసాగుతుందని చెప్పారు.