ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె. ఎస్ జవహర్ ను ఆయన కార్యాలయంలో ఇంటిలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ (మాదిగ మేధావుల సంఘం) సభ్యులు శనివారం కలిశారు. మాదిగలు నివసించే ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, వసతి తదితర విషయాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ జవహర్ కి తెలియజేశారు. దీంతో వారి సమస్యలను విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.