మాజీ మంత్రి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ ను మంగళవారం కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ఉన్న ఎస్సీ సంబంధిత వివాదాలపై ఇద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా కొవ్వూరు తహశీల్దార్ దుర్గాప్రసాద్ కూడా జవహర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.