తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ కి గురై అకాల మరణం చెందిన ముదునూరి వెంకటేష్ కుటుంబ సభ్యులను సర్పంచ్ తిగిరిపల్లి వెంకటరావు, ఉప సర్పంచ్ తోట రామకృష్ణ పరామర్శించారు. అనంతరం పంచాయతీ & ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిటికీ కూడా సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మైలవరపు రాధాకృష్ణ, గౌడ్ సంఘం అధ్యక్షులు బెజవాడ వీర్రాజు పాల్గొన్నారు.