కొవ్వూరు: విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరం

78చూసినవారు
కొవ్వూరు: విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరం
మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమని తూగో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ శనివారం కొవ్వూరులో తెలిపారు. ఒక స్త్రీ అయిన ఆమెతో అలా దురుసుగా ప్రవర్తించడం చాలా బాధాకరమని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా అధికారం శాశ్వతం కాదని అధికారం ఉందని ఏమి చేసినా చెల్లుతుందని ప్రభుత్వం నియంత్ర ధోరణిలో ఉండడం మంచి పరిణామం కాదని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కనీసం ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి కూడా భయం పుట్టేలా చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్