వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రేపు జరిగే ఫీజు పోరు కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ గురువారం పిలుపునిచ్చారు. ఏడాదిగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించని ప్రభుత్వంపై వెంటనే నిధులు విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. రేపు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.