కొవ్వూరు సర్కిల్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ విజయ్ బాబు సోమవారం తెలిపారు. మండలంలో జరిగిన రెండు చోరీల్లో రూ. 10 లక్షల విలువైన 125 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు మారుబోయిన మాల్యాద్రి, తోటకూర రామకృష్ణంరాజులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.