మహిళలపై ఆనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి మీడియాను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం కొవ్వూరులో మహిళలు ఉద్యమించి ర్యాలి నిర్వహించారు. సాక్షి మీడియా డౌన్ డౌన్ అంటూ అధిక సంఖ్యలో పాల్గొని నియోజకవర్గలోని మహిళలు నల్లజెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ర్యాలీ కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి విజయవిహార్ సెంటరు వరకు నిర్వహించారు.