కొవ్వూరు డివిజన్ పరిధిలో వరి కోత పంట ప్రయోగాలు 468 చేయవలసి ఉండగా ఇప్పటివరకు 375 ప్రయోగాలను నిర్వహించామని శాఖ ఉప గణాంకాల అధికారి సోమరాజు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలలో దిగుబడి ఆశాజనకంగా ఉందన్నారు. మిగిలిన ప్రయోగాలను కూడా ఆయా గ్రామాలలో నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.