తూ. గో జిల్లా పరిథిలో 17 కేటగిరిల కింద 2, 37, 389 మందికి రూ. 101 కోట్ల 63 లక్షల 33 వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శనివారం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో కలెక్టర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు.