కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలోని రోడ్లపై కోతకు వచ్చిన వరి పంటను సందర్శించి రైతులకు తుఫాను దృష్ట్యా సూచనలు ఇవ్వడం జరిగిందని కొవ్వూరు ఆర్టీవో రాణి సుస్మిత తెలిపారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలోని గురువారం ధర్మవరం రోడ్లపై ఉన్న వరి ధాన్యాన్ని పరిశీలించారు. వరి ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డిఓ సూచించారు.