పెద్దవం: నూతన డ్రైనేజీకి శంకుస్థాపన చేసిన ఉపసర్పంచ్

66చూసినవారు
పెద్దవం: నూతన డ్రైనేజీకి శంకుస్థాపన చేసిన ఉపసర్పంచ్
తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో మెయిన్ రోడ్ ని ఆనుకుని ఉన్న గృహాలకు డ్రైనేజీ వ్యవస్థ లేక చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యను గుర్తించిన ఉప సర్పంచ్ తోట రామకృష్ణ, గ్రామ పెద్దలు ఈరోజు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను గుర్తించిన ఉపసర్పంచ్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్