తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లోని బొమ్మూరులో శనివారం వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకమని, ఆయన నిజాయితీగా పాలన చేశారని అన్నారు. కూటమి పాలనలో వైఎస్సార్సీపీపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. “జగన్ నమ్మకం - చంద్రబాబు మోసం” పుస్తకాన్ని ఆవిష్కరించారు