తెలుగుదేశం పార్టీ ఆంధ్రరాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని రాజమండ్రి టిడిపి నాయకులు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ శనివారం కలిశారు. పల్లా శ్రీనివాస్ తండ్రి సింహాచలం(93) ఇటీవలే మరణించడంతో మరణానికి సంతాపం తెలియజేస్తూ పల్లా శ్రీనివాస్ ని తన నివాసంలో కలిసి పరామర్శించి ఓదార్చారు. సింహాచలం 1983లో రాజకీయ అరగ్రేటం చేసి యూనియన్ లీడర్ గా, ఎమ్మెల్యేగా ప్రజలకు అనేక సేవలు అందించారని అన్నారు.