రాజమహేంద్రవరం నగరంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆనం కళాకేంద్రం నందు గల శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మాజీ సర్పంచ్ చిక్కాల బాబులు, తదితరులు పాల్గొన్నారు.