రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ యువత క్రీడల్లో రాణించాలని టిడిపి యువ నాయకులు పెందుర్తి అభిరామ్ శనివారం అన్నారు. గ్రామంలోని యువత వాలీబాల్ ఆడేందుకు అవసరమైన కిట్ల కోసం ఇటీవలే చేసిన అభ్యర్థనపై అభిరామ్ తక్షణమే స్పందించి పెందుర్తి సేవా సమితి ద్వారా వాలీబాల్ కిట్లు కొనుగోలుకై ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా యువతకు ఆర్ధికంగా సహకరిస్తామని పెందుర్తి అభిరామ్ అన్నారు.