కొవ్వూరు మండలంలోని కాపవరం వద్ద కొవ్వాడ కాలువలోని గుర్రపు డెక్కను స్థానిక జనసేన నాయకులు జమ్ముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. కొంతకాలంగా ఈ కాలువలో గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీరు కదలక రైతులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొవ్వూరు మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు, టీడీపీ నాయకులు వెంకటరావు, మాజీ ఎంపీటీసీ శ్రీను ఉన్నారు.