తాళ్లపూడి మండలంలోని కోడిపందాల కోసం ఏర్పాటు చేసిన బరులను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. సంక్రాంతి సంప్రదాయంగా చేసుకోవాలని, కోడిపందాలు, జూదాలు జోలికి వెళ్లద్దని తహసీల్దార్ రవీంద్ర నాద్, ఎస్సై రామకృష్ణలు విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు రూరల్ సి. ఐ విజయబాబు, ఎస్సై రామకృష్ణలు పెద్దెవంలో మూడు బరులను ధ్వంసం చేశారు. అన్నదేవరపేట, గజ్జరం గ్రామాలలో హెచ్చరికలు జారీ చేశారు.