తాళ్లపూడి: ఆక్రమణలు తొలగించిన ఉప సర్పంచ్

తాళ్లపూడి మండలం పెద్దవం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ లేక మెయిన్ రోడ్ లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందిని గమనించిన ఉప సర్పంచ్ తోట రామకృష్ణ డ్రైనేజీ నిర్మాణానికి పూనుకున్నారు. కానీ కొద్దిపాటి ఆక్రమణలు తొలగింపు జరిగితే గాని డ్రైనేజీ నిర్మించడం సాధ్యం కాదని తెలిసి సామరస్య పూర్వకంగా ప్రజలతో మాట్లాడి చిన్నపాటి ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మాణానికి మార్గం వేశారు.