రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్బంగా తాళ్లపూడి మండలంలోని పైడిమెట్ట ఎత్తిపోతల పధకం ద్వారా ఖరీఫ్ సీజన్ సాగు నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.