తాళ్లపూడి: బాధితులకు భరోసా కలిగించడం ప్రభుత్వ బాధ్యత

69చూసినవారు
తాళ్లపూడి: బాధితులకు భరోసా కలిగించడం ప్రభుత్వ బాధ్యత
తాళ్లపూడి మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన గుల్లపూడి వీర వెంకట సత్యనారాయణ ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా నిధిని ఆయన భార్య గుల్లపూడి శైలజకి అందజేసారు. బాధితులకు భరోసా కలిగించడం ప్రభుత్వ బాధ్యతగా భావించారు.

సంబంధిత పోస్ట్