పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన గుండెపోటుకు అత్యవసర చికిత్స ఇప్పుడు దేవరపల్లిలో కూడా అందుబాటులో ఉందని వైద్యులు వివరిస్తున్నారు. దేవరపల్లి సుమంత్ ఆసుపత్రిలో 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తికి గురువారం థ్రాంబోలిసిస్ ప్రక్రియతో విజయవంతంగా చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు సుమంత్ తెలిపారు.