వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ.60,15,905 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.