వృద్ధుల అనుభవాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దిపాటి సత్యనారాయణ అన్నారు. మంగళవారం కొవ్వూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వృద్ధులకు సభ్యులు పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. పెద్దలను గౌరవించడం సాంప్రదాయంగా మారాలని సభ్యులు పిలుపునిచ్చారు.