ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాని ఒక దినచర్యలో భాగం చేసుకోవాలని గ్రామ టిడిపి అధ్యక్షుడు కొయ్యలమూడి తాతారావు శనివారం అన్నారు. దేవరపల్లి దుద్దుకూరు గ్రామంలో భారత ప్రభుత్వ పిలుపుమేరకు నిర్వహించిన యోగాంద్ర కార్యక్రమంలో పాల్గొని మానవ జీవితంలో యోగ యొక్క విశిష్టతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం, జనసేన, బిజెపి అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మరియు హై స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.