మండపేట నియోజక వర్గం పరిధిలోని ఏడిద గ్రామంలో దళిత యువకులపై ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు గురువారం దాడి చేశారంటూ దళితులు ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహం తో దళితులు పెద్ద ఎత్తున మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.