ఎమ్మెల్యేను సత్కరించిన కౌన్సిల్ సభ్యులు

62చూసినవారు
మండపేట మున్సిపల్ కార్యాలయంలో శనివారం కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు సమావేశం అనంతరం కౌన్సిల్ సభ్యులు చిరు సత్కారం చేశారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో అభినందించడంతో పాటు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చైర్ పర్సన్ పతివాడ నూకదుర్గారాణి, కమీషనర్ బి. రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్