ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకున్నప్పుడు సమాజంలో సుహృద్భావ వాతావరణ నెలకొంటుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మార్కెట్ వద్ద తోపుడుబండ్ల యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వినాయక అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.