అద్దంకి లంక వద్ద ప్రధాన రహదారి పక్కన చెత్తా రోజు రోజుకు పేరుకుపోతోంది. ఈ క్రమంలో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వర్షాల వల్ల చెత్త నుంచి దర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శానిటేషన్ పనులు తక్షణమే నిర్వహించాలని కోరుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అంటున్నారు.