అపరత భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ నీటి భద్రతకు ప్రాణం పెట్టిన మహా మనిషి కాటన్ జయంతిని పురష్కరించుకుని మండపేట రూరల్ తాపేశ్వరం లాకులు వద్ద కోనసీమ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోదావరి జిల్లాలో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు గోదావరి ప్రజలు ఆయనను కాటన్ దొర అని పిలుచుకుంటారని కొనియాడారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు పాల్గొన్నారు.