మండపేట: ఘనంగా అంకాలమ్మ జాతర మహోత్సవాలు

67చూసినవారు
సీతానగరం గ్రామదేవత అంకాలమ్మ వారి జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గ్రామ ఆడపడుచులతో కలిసి 501 బిందులతో నిర్వహించిన ప్రత్యేక కలశ పూజలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. రాత్రి జాతర ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగాయి. అనంతరం, తోట త్రిమూర్తులు సీతారామ, కోదండ రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయంచండీయాగం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్