మండపేట సైదల్లిపేట రామాలయం వద్ద నివసిస్తున్న బాలుడు అదృశ్యమైనట్లు ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు శనివారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సైదల్లిపేట రామాలయం వద్ద అవ్వారి దేవి, రాజు దంపతులు నివసిస్తున్నారు. ఈ నెల 6 ఉదయం ఇంటి నుండి సుజుకి షోరూమ్ లో పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లినట్లు తల్లి దేవి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.