రాష్ట్ర రాజకీయాలలో సునామీ సృష్టించిన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం తో మండపేట లో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్ స్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.