మండపేట పట్టణం 20వ వార్డు లోని ఎస్ ఎస్ వి వి మున్సిపల్ హై స్కూల్ నందు గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటును విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.