తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలను మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఖండించారు. మండపేటలో ఆదివారం అయన మాట్లాడుతూ 2016 లో తాను కమిటీ సభ్యునిగా ఉన్నపుడు తిరుమల గోశాల పరిశీలనకు వెళ్లగా అప్పటి గోశాల డైరెక్టర్ గా హరినాథ్ రెడ్డి ఉన్నారని ఆనాటి గోశాల దీనస్థితి చూసి తాము చలించి పోయామన్నారు. కనీసం ఆహారం నీరు అందక ఉండేవని ఆనాటి దుస్థితి పై చంద్రబాబు స్పందించి మంచి ఏర్పాట్లు చేశారని తెలిపారు. అప్పటి అధికారి హరినాథ్ రెడ్డి సస్పెండ్ అయి ఇపుడు ఈ కుట్ర చేసినట్లు పేర్కొన్నారు.