భారీ వర్షానికి పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి ఈదురుగాలుల దాటికి మండపేటలోని రెడ్డి గణేశ్వరరావు వీధిలో కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై పడడంతో ఆ వీధిలో ఉన్న మూడు విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డ విషయం విధితమే. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు.