అంధుల పాఠశాలలో వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆలమూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఐ. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఉత్తర్వులు మేరకు శనివారం మండపేట తర్వానిపేటలో ప్రభుత్వ అంధుల పాఠశాలలో వైద్య సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ ఎస్. సత్య నారాయణ పాల్గొన్నారు.