మండపేట పురపాలక సంఘ పరిధిలోని వివిధ వార్డుల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ ప్రత్తివాడ నూక దుర్గారాణి శనివారం శంఖుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, 18వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ ఎర్రగుంట అయ్యప్ప, ఈ కార్యక్రమంనకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రుశ్రీ వర ప్రకాష్ పాల్గొన్నారు.