ఎన్టీఆర్ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగుశక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం దినోత్సవంపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వేగుళ్లను రామ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రముఖుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు జాబితా విడుదల చేసిందన్నారు.